ఏపీ ఫైబర్‌ నెట్‌ కేసులో సాంబశివరావుకు బెయిల్‌

ఆంధ్ర ప్రదేశ్‌ ఫైబర్‌ నెట్‌ కేసు లో మాజీ కేంద్ర అధికారి సాంబశివరావుకు కాస్త ఊరట లభించింది. ఈ ఫైబర్‌ నెట్‌ కేసు లో సాంబశివరావుకు బెయిల్‌ మంజూరు చేసింది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర హై కోర్టు. ఫైబర్‌ నెట్‌ కేసు లో రెండు రోజుల క్రితం ఆరెస్ట్‌ అయిన ఐఆర్టీఎస్‌ అధికారి సాంబశివ రావు… ఫైబర్‌ నెట్‌ కేసు లో సాంబశివరావు తో పాటు హరి ప్రసాద్‌ ను ప్రశ్నించింది సీఐడీ బృందం.

highcourt
highcourt

అయితే.. తన అరెస్ట్‌ పై నిన్న ఏపీ హై కోర్టు లో హౌస్ మోషన్‌ పిటీషన్‌ దాఖలు చేశారు సాంబశివరావు. ఈ నేపథ్యం లోనే… ఐఆర్టీఎస్‌ అధికారి సాంబశివ రావు కి బెయిల్‌ మంజూరు చేసింది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర హై కోర్టు. షరతుల కూడిన బెయిల్‌ మంజూరు చేసింది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర హై కోర్టు.  కాగా.. రెండు రోజుల కిందట… సాంబశివరావు అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే.