మానవాళికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ హెచ్చరిక.. అదేంటంటే.. ?

-

 

ప్రపంచాన్ని వరుసగా కరోనా, ఎబోలా లాంటి వ్యాదులు వణికిస్తుంటే తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సమస్త మానవాళి ఉలిక్కిపడే విషయాన్ని చెబుతుంది.. ఆ ఏముంది ఇప్పటికి ఎన్ని ప్రమాదాలు ఎదుర్కోవడం లేదు, ఎన్ని రోగాలను ఎదిరించి బ్రతకడం లేదు అని అనుకుంటున్నారా.. అయినా అలా అనుకోవడంలో తప్పు లేదు ఎందుకంటే ఈ సమస్త మానవాళి నిత్యం మృత్యువుతోనే దోస్తీకడుతుంది..

అందులో మనం నివసించే భూమి ఓ ప్రమాదకరమైన విశ్వంలో తిరుగుతోంది. అదెలా అంటే మన భూమి చుట్టూ 8000కు పైగా 450 అడుగుల కంటే పెద్దగా విస్తీర్ణం కలిగిన గ్రహశకలాలు ఉన్నాయి. ఇవన్నీ భూమికి 70 లక్షల కిలోమీటర్ల లోపు తిరుగుతున్నాయి. వీటిని నాసా, పొటెన్షియల్లీ డేంజరస్ ఆస్టరాయిడ్స్ లిస్టులో చేర్చింది. ఇంకాస్త దూరానికి లెక్క వేస్తే.. దాదాపు 25000 దాకా ఇవి ఉండొచ్చనే అంచనా ఉంది. ఇన్ని ఉన్నా ఏ ఒక్కటీ భూమికి తగలకపోవడం మన అదృష్టం అనుకోవచ్చు, ఒకవేళ తగిలితే మనంత దురదృష్టవంతులు లేరనవచ్చూ..

 

ఇక నాసా చేస్తున్న హెచ్చరిక ఏంటంటే.. ఈనెల అంటే జూన్ 6వ తేదిన ఓ భారీ గ్రహశకలం భూమివైపు వస్తోందట. అయితే మాకేం భయం అంటారా.. వినండి ముందు.. ఇది చిన్న గ్రహశకలం కాదట, దీని పరిమాణం 800 నుంచి 1800 అడుగుల దాకా ఉండొచ్చంటున్నారు. ఇక దీని స్పీడ్ చూస్తే సెకండ్‌కి 11.1 కిలోమీటర్లు. ఉదాహరణకి విశాఖ నుంచి హైదరాబాద్‌కి నిమిషంలో వెళ్లగలదు. అంటే ఇది ఎంత వేగంతో వెళ్తుందో ఊహించుకోండి. అంత వేగంతో వెళ్లుతున్న గ్రహం భూమిని ఢీ కొంటే ఇంకేమైనా ఉందా భూమి ముక్కలవ్వడం ఖాయం. కానీ ఈ గ్రహశకలం వల్ల మనకు అలాంటి టెన్షన్ లేదని, అది మనకు చాలా దూరం నుంచి వెళ్తోంది కాబట్టి హైరాన వద్దని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.. ఇకపోతే ఈ గ్రహాన్ని కూడా నాసా పొటెన్షియల్లీ డేంజరస్ కేటగిరీలో చేర్చింది..

Read more RELATED
Recommended to you

Latest news