కొత్త రాజకీయ ఫ్రంట్.. కాంగ్రెస్ భాగస్వామ్యంపై శివసేన నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు

-

ఎన్డీయే, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా మరో కూటమిని తయారు చేసేందుకు ఎన్డీయేతర సీఎంలు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే.. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను ముంబైలో కలిశారు. తాజాగా రాజకీయ పరిణామాలపై మాట్లాడారు. దేశంలోని తీసుకురావాాల్సిన మార్పుల గురించి చర్చించారు. అయితే బీజేపీ, కాంగ్రేసేతర కూటమికి ప్రయత్నిస్తున్నారు సీఎం కేసీఆర్. కేసీఆర్ తో పాటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్ లేకుండా కూటమికి ప్రయత్నిస్తున్నారు.

అయితే కొత్త కూటమి.. కాంగ్రెస్ భాగస్వామ్యంపై శివసేన కీలక నేత, ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లేకుండా రాజకీయ ఫ్రంట్ ఏర్పడుతుందని మేం ఎప్పుడూ చెప్పలేదు… మమతా బెనర్జీ రాజకీయ ఫ్రంట్‌ను సూచించిన సమయంలో, కాంగ్రెస్‌ను వెంట తీసుకెళ్లాలని మాట్లాడిన మొదటి రాజకీయ పార్టీ శివసేన అని రౌత్ అన్నారు. అందరినీ వెంట తీసుకెళ్లి నడిపించే సత్తా కేసీఆర్‌కు ఉందని  సంజయ్ రౌత్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version