తెలంగాణ నిరుద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్.. మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల..

-

తెలంగాణ సర్కార్ నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను అందిస్తున్నారు..ప్రభుత్వ శాఖలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు..రాష్ట్ర వ్యాప్తంగా 80 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్  అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే..

వరుసగా జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు అధికారులు. తాజాగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. 53 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్(వర్క్స్‌) గ్రేడ్-2 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 17న ప్రారంభం కానుంది. దరఖాస్తులకు సెప్టెంబర్ 6ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు అధికారిక www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.

అర్హతలు:

గుర్తింపు ఉన్న యూనివర్సిటీ నుంచి డిగ్రీ విద్యార్హత పొందిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. 18-44 ఏళ్ల వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు..

దరఖాస్తు ఫీజు: దరఖాస్తు చేసుకునే సమయంలో రూ. 200 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజుగా మరో రూ.120 చెల్లించాల్సి ఉంటుంది..

వెబ్‌సైట్‌లో నెలకొన్ని సాంకేతిక సమస్యల కారణంగానే వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు టీఎస్‌పీఎస్సీ అధికారులు. టెక్నికల్‌ ప్రాబ్లమ్‌తో అప్లికేషన్స్‌ తీసుకోవడం లేదని గుర్తించిన అధికారులు గురువారం ఈ విషయాన్ని ప్రకటించారు. దరఖాస్తులు ఎప్పటి నుంచి తీసుకుంటామన్న దానిపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది..

Read more RELATED
Recommended to you

Latest news