పదవి నుంచి దిగేందుకు ససేమిరా అంటున్న ప్రధాని.. కిందకి లాగుతున్న నిరసనలు..!

-

ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుకి వ్యతిరేకంగా జెరూసలేంలో నిరసనలు కొనసాగుతున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నెతన్యాహు.. ప్రధాని పదవి నుంచి వైదొలగాలని 11 వారాలుగా ఆందోళన చేపడుతున్నారు అక్కడి ప్రజలు. ఆయన ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు.పదవి నుంచి దిగేందుకు ససేమిరా అంటున్న బెంజిమన్‌.. తనపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. ఈ ఆందోళనలన్నీ వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తులు చేస్తున్న ప్రేరేపిత నిరసనలుగా పేర్కొన్నారు.

తొలిదశలో కరోనా కేసులను బాగానే కట్టడి చేసిన నెతన్యాహు సర్కార్.. అన్‌లాక్‌ తర్వాత విఫలమవడం ప్రజల నిరసనలకు కారణమైనట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌లో సుమారు లక్ష మంది వరకు మహమ్మారి బారినపడ్డారు. నిరుద్యోగం 20 శాతానికి పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో నెతన్యాహుపై అవినీతి ఆరోపణలు కూడా రావడం వల్ల.. ప్రజలు ఆగ్రహంతో రోడ్లపైకి వస్తున్నారు.ఇజ్రాయెల్​ను బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని యూఏఈ రద్దు చేసుకుంది. ఈ మేరకు యూఏఈ పాలకుడు షేక్​ ఖలిఫా.. ఉత్తర్వులపై సంతకం చేశారు. ఇరు దేశాల మధ్య కుదిరిన చారిత్రక ఒప్పందం నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news