క్రికెట్‌పై కన్నేసిన సత్య నాదేళ్ల..!!

-

మైక్రోస్టాప్ సీఈఓ సత్య నాదేళ్ల కన్ను క్రికెట్ వ్యాపారంపై పడినట్లు కనిపిస్తోంది. వచ్చే ఏడాది అమెరికాలో ప్రారంభం కానున్న మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ)లో భారీగా పెట్టుబడులు పెట్టనున్నారు. ఇప్పటికే మేజర్ లీగ్ సాకర్, ఫ్రాంచైజీ సీటెల్ సౌండర్స్ పార్ట్‌ కు సహ యజమానిగా కొనసాగుతున్న నాదేళ్ల.. పెట్టుబడి దారుల నుంచి 44 మిలియన్ డాలర్ల పెట్టుబడిని కూడా సేకరించినట్లు తెలుస్తోంది. ఇందులో ఆయన పెట్టుబడులే అధికంగా ఉన్నాయి. దీంతో ప్రపంచ క్రికెట్ మార్కెట్‌లో కీలక మార్పులు జరగనున్నట్లు సమాచారం.

satya-nadella
satya-nadella

మేజర్ లీగ్ క్రికెట్ కోసం మొత్తంగా 120 మిలియన్ డాలర్లు సేకరించే పనిలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు 44 మిలియన్ డాలర్లు సేకరించగా.. మరో 12 నెలల్లో 76 మిలియన్ డాలర్లు సేకరించడానికి భారీ ఏర్పాటు జరుగుతున్నాయి. మేజర్ లీగ్ క్రికెట్ టీ20లో 6 ప్రాంఛైజీగా జట్లు తలపడనున్నాయి. ఈ మేరకు అమెరికా క్రికెట్ నుంచి పర్మిషన్ కూడా తీసుకున్నట్లు సమాచారం. అయితే అమెరికాలో క్రికెట్ ఆదరణ పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదేళ్ల తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news