Sriram Nimmala : కేటీఆర్ చేతుల మీదుగా “సాఫ్ట్‌వేర్ బ్లూస్” ట్రైలర్ రిలీజ్

-

లవ్‌ & కామెడీ ఎంటర్‌ టైనర్‌ గా తెరకెక్కుతున్న తాజాగా సినిమా..”సాఫ్ట్‌వేర్ బ్లూస్”. పూర్తిగా యంగ్‌ టాలెంటెడ్‌ యాక్టర్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సిల్వర్‌ ఫిక్సల్‌ మీడియా వర్క్స్‌ నిర్మాణంలో.. ఉమా శంకర్‌ దర్శకత్వంలో “సాఫ్ట్‌వేర్ బ్లూస్” సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాకు సుభాస్‌ ఆనంద్‌ సంగీత స్వరాలు అందిస్తున్నారు.

బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ జయశంకర్‌ అందిస్తుండగా.. వంశీకృష్ణ ఈ సినిమాకు లిరిక్స్‌ అందిస్తున్నారు. ఇక ఉత్తర సినిమాతో టాలీవుడ్‌ కు ఎంట్రీ ఇచ్చిన యంగ్‌ హీరో శ్రీరామ్‌ నిమ్మల ఇందులో నటిస్తున్నారు. ఎంతో గ్లామర్‌ గా ఉండే.. శ్రీరామ్‌.. ఈ సినిమాలో చాలా అనుభవం ఉన్న నటుడిలా యాక్టింగ్‌ చేశారు. ఇందులో శ్రీరామ్‌ సరసన భవనా హీరోయిన్‌ గా నటిస్తోంది.

 

అయితే.. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ ను కేటీఆర్‌ చేతుల మీదుగా రిలీజ్‌ చేశారు. ఇక ఈ ట్రైలర్‌ లో శ్రీరామ్‌ నిమ్మల యాక్టింగ్‌ లో అదరగొట్టాడు. సినిమా టైటిల్‌ కు తగ్గట్టుగానే స్టోరీ ఉన్నట్లు ట్రైలర్‌ చూస్తే.. అర్థమౌవుతుంది. సాఫ్ట్‌ వేర్‌ జాబ్‌ కొట్టడానికి యూత్‌ ఎంత కష్టపడతారో.. అలాగే.. ఆ జాబ్‌ లో ప్రెషర్‌ ను కూడా ఈ సినిమాలో చూపించారు. కాగా.. ఈ సినిమా జూన్‌ 24 వ తేదీన విడుదల కానుంది. ఇది ఇలా ఉండగా.. హీరో శ్రీరామ్‌ నిమ్మల నటించిన తురుమ్‌ ఖాన్‌ సినిమా ఇంకా విడుదల కాలేదన్న సంగతి తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news