గ్యాస్ ని ఆదా చెయ్యాలా..? అయితే ఇలా చేస్తే సరి..!

-

ఈ మధ్య కాలం లో గ్యాస్ ధరలు మండిపోతున్నాయి గ్యాస్ ధరలు చూస్తుంటే చాలా మందికి భయం వేస్తోంది. సిలిండర్ ధర ఒక్క సారిగా 50 రూపాయలు పెరిగిపోయింది దీంతో సామాన్యులకి చాలా ఇబ్బంది కలుగుతుంది. గ్యాస్ సిలిండర్ ని ఆదా చేయాలంటే చిన్న చిట్కాలని పాటించడం మంచిది.

Gas.jpg

వంట గ్యాస్ ధర రోజు రోజు కి పెరిగిపోతుండడంతో చాలా మందికి ఇబ్బంది అవుతుంది. పెట్రోలియం సంస్థలు పెద్ద షాక్ ని ఇచ్చాయి. వంట గ్యాస్ ధరలు అమాంతం పెరిగి పోయాయి. ఎంత ధర పెరిగినా వంట చేయడం తప్పదు.

గ్యాస్ సిలిండర్ లని ఇలా ఆదా చేయండి:

ఎక్కువ వేడి మీద ఉడికించకండి. గ్యాస్ సిలిండర్లని ఆదా చేయాలంటే తక్కువ వేడి మీద ఉడికించాలి.
అధిక వేడి మీద ఉడికిస్తే పాత్ర తో పాటుగా ఆ మంట చుట్టూ వ్యాపిస్తుంది. ఇది గ్యాస్ ని వృధా చేస్తుంది.
వంట చేసేటప్పుడు పాత్ర కి మూత పెట్టి ఉడికించండి. గ్యాస్ ని కనుక మీరు ఆదా చేయాలంటే మూత పెట్టి ఉడికించండి. స్టీమ్ ద్వారా ఆహారం త్వరగా ఉడుకుతుంది. దీంతో మీరు ఆదా చేయొచ్చు.
బర్నర్ ని శుభ్రం చేయండి. బర్నర్ కి దుమ్ము దూళి ఉండి పోతే గ్యాస్ ఎక్కువ అవుతుంది మీరు బర్నర్ ని బాగా క్లీన్ చేస్తే గ్యాస్ ని ఆదా చేసుకోవచ్చు.
అలానే అన్నిటినీ ఒక దగ్గర ఉంచుకోండి మీరు వంట చేసే ముందు అన్నిటిని పక్కనే పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకోవడం వలన త్వరగా వంట పూర్తి అవుతుంది గ్యాస్ ఆదా చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి ప్రతిదీ మీరు అప్పుడు వెతుక్కుంటూ ఉంటే ఈలోగా గ్యాస్ వేస్ట్ అయిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news