ఆఫీసుల్లో టీ, కాఫీలు తాగుతున్నారా.. కమ్యూనల్ కిచెన్‌ ద్వారా న్యూమోనియా ముప్పు

-

మనకు టీ, కాఫీ అలవాట్లు లేకున్నా..డైలీ ఆఫీసుకు వెళ్తుంటే మాత్రం కచ్చితంగా అలవాటు అయిపోతాయి.. ఆ పని ఒత్తిడికి కాస్త వేడి వేడిగా ఏదైనా తాగితే బాగుండు అనిపిస్తుంది. ఆఫీసుల్లో కూడా టీ, కాఫీలు ఇవ్వడం అనేది ఇప్పుడు కామన్‌ అయిపోయింది. అయితే, తాజా పరిశోధనలో బయటపడిన విషయాలు గురించి తెలిసిన తర్వాత.. కాఫీ కప్పులను ముట్టుకోవాలంటేనే మీరు భయపడిపోతారు. ఆఫీసుల్లో కమ్యూనల్ కిచెన్‌లో ఉపయోగించే వస్తువుల్లో చాలా ప్రమాదకరమైన బాక్టీరియా ఉంటుందని తేలింది. ఆఫీస్ కిచెన్స్‌ను చాలా పరిశుభ్రంగా ఉంచాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేకపోతే ఉద్యోగులు అనారోగ్యాలకు గురై ప్రొడక్టివిటీ తగ్గిపోయే ప్రమాదం ఉంది.
ఆఫీసుల్లోని కెటిల్స్, ప్రిజ్ డోర్ హ్యాండిల్స్, కాఫీ మెషిన్లు, మైక్రోవేవ్ బటన్ల ద్వారా సూక్ష్మక్రిములు వ్యాపిస్తున్నాయని బ్రిటన్ పరిశోధకులు అంటున్నారు. లివర్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్‌కు చెందిన చీఫ్ రీసెర్చర్ డాక్టర్ ఆడమ్ రాబర్ట్ చెప్పిన దాన్ని బట్టి ‘‘టాయిలెట్లకు వెళ్లి వచ్చిన తర్వాత చేతులు సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల.. ప్రమాదకర బ్యాక్టీరియా కిచెన్‌లోనూ వ్యాపిస్తోంది’’ అని తెలిపారు. ఇన్ఫెక్షన్ కలిగిన వ్యక్తి తాకిన ప్రదేశాలను తాకిన వారంతా కూడా అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. కమ్యూనల్ కిచెన్స్, నడిచే ప్రాంతాలు, ఆఫీస్ స్పేస్‌లు తదితర పబ్లిక్ ప్లేసుల నుంచి సేకరించిన స్వాబ్‌లలో ఎస్చేరిషియా కోలీ (ఈకోలీ) అనే ప్రమాదకర బ్యాక్టీరియాను కనుగొన్నారు. ఇది సాధారణ బ్యాక్టీరియా. దీని ద్వారా అతిసారం, యూరీనరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, గ్యాస్ట్రో ఇన్ఫెక్షన్లు వస్తాయి.
న్యూమోనియా వంటి శ్వాసకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు కలిగించే సుడోమోనాస్ కూడా వచ్చే అవకాశం ఉంది. క్లేబ్సీయెల్లా అనే సూక్ష్మజీవి న్యూమోనియాకు కారణం అవుతుంది. ఇది మలం ద్వారా వ్యాపిస్తుంది. దీన్ని దాదాపు 11 కిచెన్ వస్తువల మీద కనిపించినట్లు పరిశోధకులు అంటున్నారు.. ప్రతి వస్తువు మీద ఫంగైతో నిండి ఉన్నట్టు మైక్రోబయాలజిస్టులు చెబుతున్నారు.
ప్రిజ్ డోర్ హ్యాండిల్స్ మీద కూడా సూక్ష్మ క్రిములు కనిపించాయట. ఈ ఇన్ఫెక్షన్ నుంచి తప్పించుకోవడానికి ఉన్న సులభమైన మార్గం.. చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడమేనని వైద్యులు అంటున్నారు. ఫ్లూ, నోరోవైరస్ వంటి సాధారణ జలుబు కలిగించే వ్యాధుల వ్యాప్తిని తగ్గించాలంటే.. అవి వ్యాపించే తీరును అర్థం చేసుకుని అవగాహన కల్పించడం అవసరం. దశాబ్ద కాలంలో నోరోవైరస్ కేసులు బాగా పెరిగాయి. నోరోవైరస్ చాలా వేగంగా తేలికగా వ్యాపిస్తుంది. ఇన్ఫెక్షన్ సోకిన వారితో కాస్త దూరం పాటించడం ద్వారా దీన్ని అరికట్టవచ్చు.. వైరస్ కలిగిన వస్తువులను తాకిన తర్వాత నోరు, ముక్కు, ముఖాన్ని ముట్టుకోవడం వల్ల కూడా వైరస్ శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. కాబట్టి… వీలైనంత వరకు కమ్యూనల్ కిచెన్‌లకు దూరంగా ఉండడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news