డబ్బులు ఆదా చేసుకోండిలా..!

-

ప్రతిఒక్కరి జీవితం డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. ఏ చిన్న వస్తువు కొనుగోలు చేసినా రూపాయి ఖర్చు చేయాల్సిందే. కుటుంబ పోషణ, పిల్లల చదువులు, పండగలు, వైద్యం ఇలా అన్నింటికీ డబ్బుతో ముడిపడి ఉంటుంది. భవిష్యత్ లో బాగుండాలనుకునేందుకు రేయింబవళ్లు డబ్బు కోసం శ్రమిస్తుంటారు. అయితే కొందరు ఆదాయం ఉంది కదా అని ఖర్చు చేయడానికి వెనకడుగు వేయరు. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేసేస్తుంటారు. అయితే ప్రస్తుత పరిస్థితి మారింది. కరోనా వల్ల దాచుకున్న డబ్బులు కూడా ఖర్చు అయి పోయాయి. దీంతో సామాన్యులు డబ్బును ఆదా చేయాలని భావిస్తుంటారు. అయితే అనవసరమైన ఖర్చులు తగ్గించుకుని డబ్బులు పొదుపు చేసుకోవచ్చు.

money
money

నెలవారీ ఖర్చులు రాసుకోండి..
నెలవారీ ఖర్చుల జాబితాను రాసుకోండి. అప్పుడు వచ్చే ఆదాయం, ఖర్చులపై అవగాహన ఉంటుంది. డబ్బు ఎలా ఖర్చు అవుతుందో తెలుస్తుంది కాబట్టి అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవచ్చు.

మొబైల్ రీఛార్జ్ విషయంలో…
ఇంట్లో సభ్యులందరికీ మొబైల్ ఫోన్స్ తప్పనిసరిగా ఉంటారు. విడివిడిగా అందరికీ రీఛార్జ్ చేసినప్పుడు తక్కువే అనిపించినా.. బిల్లు కలిపి చూస్తే వేలల్లో వస్తుంది. అయితే కొన్ని టెలికం సంస్థలు తక్కువ ధరతో ఎక్కువ ఆఫర్లు పొందే ప్లాన్ లను తెచ్చాయి. వాటితో తక్కువ ధరతో కాల్స్, డేటాను పొందవచ్చు.

ఇంటర్నెట్.. కేబుల్ బిల్లులు..
ప్రస్తుతం స్మార్ట్ టీవీలు అందుబాటులోకి వచ్చాయి. ఓటీటీలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతుండటం.. కేబుల్ టీవీలో వచ్చే అనేక ఛానళ్లు ఇందులోనే వస్తుండటంతో చాలా మంది ఇంటర్నెట్ కనెక్షన్లపై మొగ్గు చూపుతున్నారు. స్మార్ట్ టీవీలు ఉన్న వాళ్లు ఇంటర్నేట్ బిల్లు, కేబుల్ బిల్లు కట్టి డబ్బులు వృథా చేసుకోకుండా.. తక్కువ ధరకే ఇంటర్నేట్ ప్యాకేజీలను ఎంచుకోవాలి.

విద్యుత్ బిల్లు…
ఇంట్లో అవసరం లేకున్నా.. లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు వేస్తుంటారు. బయటికి వెళ్లేటప్పుడు కూడా వాటిని ఆఫ్ చేయరు. ఇలా విద్యుత్ వినియోగంలో పరిమిత యూనిట్లకు మించితే విద్యుత్ ఛార్జీల మోత మోగుతుంది. డబ్బులు ఆదా చేసుకోవాలంటే ఎలక్ట్రానిక్ వస్తువులు అవసరమైనప్పుడే వాడితే ప్రయోజనం.

వడ్డీలతో దూరంగా ఉంటేనే బెటర్..
చాలా వరకు కొందరు డబ్బులు ఉన్నా.. అప్పులు చేసి జల్సాలకు పాల్పడుతుంటారు. ఫోన్ నుంచి మొదలుకుని టీవీ, ఫ్రిజ్, ఏసీ ఇలా ప్రతిఒక్కటి ఈఎంఐ రూపంలో చెల్లిస్తుంటారు. దీని వల్ల రుణగ్రహీతకు నష్టమే వాటిల్లుతుంది. అందుకే తక్కువ వడ్డీతో రుణం అందించే బ్యాంకు చాలానే ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే వడ్డీ భారం తప్పుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news