చక్కెరతో ఇలా చేస్తే ఆర్థిక, మానసిక కష్టాలన్నీ తీరిపోతాయట..!

-

కొందరు ఎంత కష్టపడి పనిచేసినా.. లైఫ్ లో ఆర్థికంగా సెటిల్ అవ్వలేరు. ఎప్పుడూ ఏదో ఒక సమస్య వేధిస్తూనే ఉంటుంది. కారణం మానవ ప్రయత్నాలతో పాటు, జ్యోతిష్య సంబంధిత అంశాలు కూడా ఉంటాయి. ఇలాంటి కాల దోషాలు తొలగిపోవడానికి జ్యోతిస్య శాస్త్రంలో పరిష్కారాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. వాటిని అనుసరించడం ద్వారా దోషాలను తొలగించవచ్చంటున్నారు.
 పంచదారకు సంబంధించిన జ్యోతిష్య పద్థతులు పాటించడం ద్వారా జీవితంలో ఆనందం, శ్రేయస్సును తీసుకురావచ్చని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా కెరీర్‌తో పాటు, చక్కెరకు సంబంధించిన జ్యోతిష్య సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయట. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుందట.
పంచదారకు జ్యోతిష్య పరిహారాలు పాటించడం ద్వారా గ్రహ దోషాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు. ఇందుకోసం సూర్య భగవానుని ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. ఒక పాత్రలో శుభ్రమైన నీటిని తీసుకుని, అందులో కొంత చక్కెర వేయాలి. ఆ నీటిని ఉదయాన్నే సూర్య భగవానుడికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల సూర్యభగవానుడు త్వరగా ప్రసన్నుడై గ్రహ దోషాలు తొలగిస్తాడని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది.
వ్యాపారంలో అడ్డంకులు, ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నట్లయితే.. వారు చక్కెర నివారణలను చేయొచ్చు. చక్కెరతో చేసిన నీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఒక రాగి పాత్రను తీసుకుని అందులో కొన్ని నీళ్లలో చక్కెర వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయం పూజ చేసిన తర్వాత ఈ నీటిని తాగాలి. అలాగే, ఏదైనా శుభకార్యాల కోసం బయటకు వెళుతున్నట్లయితే, ఆ సమయంలో తయారుచేసిన నీటిని ఖచ్చితంగా తాగాలి. ఇలా చేయడం ద్వారా అన్ని అంశాల్లో విజయం సిద్ధిస్తుందని విశ్వాసం.
ఇంట్లో పితృ దోష సమస్యలు ఉంటే.. ఆర్థికంగానే కాకుండా శారీరకంగా కూడా చాలా సమస్యలు చుట్టుముడుతాయి. పితృ దోషం కారణంగా కుటుంబ సభ్యుల మధ్య తరచూ విబేధాలు వస్తాయి. పిండితో రోటీని తయారు చేసి, అందులో పంచదార కలపాలి. వాటిని కాకులకు ఆహారంగా వేయాలి. ఇలా చేస్తే సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయని జ్యోతిష్య అంటున్నారు.
గమనిక: ఇక్కడ పేర్కొన్న వివరాలు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జ్యోతిష్య పండితులు తెలిపిన సమాచారం ప్రకారం..మాత్రమే అందించడం జరిగింది. మనలోకం సొంతంగా రాసింది కాదని గమనించగలరు.
                                                                                               – Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news