బిల్కిస్​ బానో కేసు.. గుజరాత్ సర్కార్​పై సుప్రీం కోర్టు ఫైర్

-

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్‌ బానో సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబంలోని ఏడుగురు సభ్యుల హత్యాకాండ కేసులో 11 మంది దోషులకు ఉపశమనం కల్పించే చర్యలు చేపట్టిన గుజరాత్‌ సర్కారుపై సుప్రీంకోర్టు మండిపడింది. ఇవాళ బిల్కిస్‌.. రేపు మీరో.. నేనో.. ఇంకెవరికైనా జరగొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ‘కేసు తీవ్రత ఏమిటో పట్టించుకోరా? మీరు అసలు మనసుపెట్టి చూశారా?’ అంటూ ఫైర్ అయింది.

2002లో గోధ్రా అల్లర్ల సమయంలో గర్భిణి బిల్కిస్‌ బానోపై జరిగిన దారుణానికి సంబంధించిన కేసులో దోషులను ముందుగానే పెరోల్‌పై విడుదల చేయడానికి కారణాలను జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌, జస్టిస్‌ బి.వి.నాగరత్నల ధర్మాసనం మంగళవారం ప్రశ్నించింది. ఖైదులో ఉన్నవారిపై దయ చూపేముందు వారు చేసిన నేరం తీవ్రతను గమనంలోకి తీసుకోవాలి కదా అని వ్యాఖ్యానించింది.

‘‘రికార్డులను చూడండి. ఒకరికి 1,000 రోజులు, మరొకరికి 1,200 రోజులు, ఇంకొకరికి 1,500 రోజులు చొప్పున పెరోల్‌ ఇచ్చారు. ఇదేమీ సాదాసీదా సెక్షన్‌ 302 (హత్య) కేసు కాదు. ఇది సామూహిక అత్యాచారంతో ముడిపడిన హత్యల కేసు. నారింజలను యాపిల్‌ పండ్లతో ఎలా పోల్చలేరో… ఒక్క హత్య కేసుతో సామూహిక హత్యల్ని కూడా పోల్చలేరు’’ అని స్పష్టం చేసింది. పెరోల్‌పై దోషుల విడుదలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది.

Read more RELATED
Recommended to you

Latest news