విద్యార్థులకు అలర్ట్‌.. రేపు స్కూల్‌ టైమింగ్స్‌ మార్పు

-

చంద్రయాన్-3 మిషన్‌కు సంబంధించి ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రయాన్-3 ల్యాండింగ్ సందర్భంగా ఆగస్టు 23 సాయంత్రం అన్ని పాఠశాలలను ఒక గంట పాటు తెరవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలోని పిల్లలకు చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-3 ల్యాండింగ్ ప్రత్యక్ష ప్రసారం చూపబడుతుంది. దీని కోసం డైరెక్టర్ జనరల్ స్కూల్ ఎడ్యుకేషన్, స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయానికి నోటీసు జారీ చేయబడింది.

Majority of rural childern in Haryana still prefer private schools | Latest  News India - Hindustan Times

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక చంద్రయాన్‌-3 కీలక దశకు చేరుకుంది. ల్యాండర్‌ మాడ్యూల్‌.. చందమామకు మరింత చేరువైంది. ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి ఇప్పటికే విడిపోయిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ప్రస్తుతం.. చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తున్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news