మార్చి మొదటి వారంలో తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీ పశుసంవర్ధక శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. కొత్త లబ్ధిదారులు వారి వాటా కింద డీడీలు చెల్లించాలని సూచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో… మొదటి, రెండు విడతల్లో ఇప్పటివరకు ఏకంగా నాలుగు లక్ష ల మంది లబ్ధిదారులకు 81 లక్షల గొర్రెలను పంపిణి చేశా రు.
రెండో విడత కోసం నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి పశుసంవర్ధక శాఖ రుణం తీసుకుంటున్నది. ఈ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. రుణం మంజూరు కాగానే గొర్రెల పంపిణీ ప్రక్రియను అధికారులు మొదలు పెట్టనున్నారు.
రెండో విడుదల సుమారు 3.5 లక్షల మంది లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్ లో గొర్రెల ధరలు పెరగడంతో ప్రభుత్వం యూనిట్ ధరను కూడా పెంచేసింది. పెరిగిన ధరలకు అనుగుణంగా లబ్ధిదారులు డిడిలు చెల్లించెలా చర్యలు అధికారులు చేపట్టారు. కేసీఆర్ సర్కార్ తాజా ప్రకటన తో యాదవులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.