సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఫ్యామిలీ అంటే ఎంత ఇష్టమో చాలా ఇంటర్వ్యూ లలో చెప్పారు.ఇక తాను తనతో కలిసి నటించిన నమ్రత ను పెళ్లి చేసుకున్న తర్వాత తన కెరియర్ జెట్ స్పీడ్ లో దూసుకొని పొయింది. ఇక నమ్రత శిరోద్కర్ తన వెనకాల బ్యాక్ బోన్ లా ఉంటూ ఫ్యామిలీ ను చూసుకుంటూ తన బిజినెస్ వ్యవహారాలు మొత్తం తానే చూసుకుంటూ ఎంతో అభివృద్ధి చేసింది.
తాజాగా జరిగిన ఇంటర్వ్యూ లో నమ్రత తన ఫ్యామిలీ లైఫ్ గురించి చెప్పుకొచ్చింది. తనకు మహేష్ బాబు నటించిన సినిమాల్లో పోకిరి అంటే బాగా ఇష్టమని చెప్పింది.అలాగే పెళ్లి తర్వాత నేనే సినిమాలు మనేసా అని చెప్పుకొచ్చింది.మహేష్‌తో పెళ్లి జరగడమే తనకు హ్యాపీ మూమెంట్ అని నమ్రత చెప్పుకొచ్చింది. తల్లి, భార్యగా ఉండేందుకు సినిమాలకు దూరంగా ఉన్నట్టు చెప్పుకొచ్చింది.తనకు వంట అస్సలు రాదని బాంబ్ పేల్చింది. మా ఇంట్లో వంట మొత్తం వంట మనిషి చేస్తుందని ఉంటుందని చెప్పుకొచ్చింది నమ్రత. ఆమ్లెట్, టీ, కాఫీ, మ్యాగీ వంటివి మాత్రమే చేస్తా అని చెప్పింది.
ఇక తమ కుటుంబంలో కూడా చాలా కష్టాలు ఉన్నాయని చెప్పింది.గౌతమ్ పుట్టిన సమయంలో అయితే ఎన్నో కష్టాలు పడ్డాను.. అసలు గౌతమ్ బతుకుతాడో లేదో అన్నట్టుగా వైద్యులు చెప్పారని మాకు చాలా భయం వేసింది అని చెప్పుకొచ్చింది.డాక్టర్స్ చాలా కష్టపడి నా బిడ్డను బ్రతికించారు. అప్పుడే మాకు రెండో బిడ్డ వద్దు అని అనుకున్నామని, కాని ఇద్దరూ ఉండాలి అని మళ్లీ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది.ఒక వేళ సితార పుట్టి ఉండకపోతే జీవితంలో చాలా కోల్పోయే వారం అని నమ్రత తెలిపింది. అలాగే సినిమా నిర్మాణం గురించి చెబుతూ తమకు నచ్చిన కథలు వస్తేనే సినిమాలు నిర్మిస్తామని నమ్రత చెప్పింది. ఇక ముందు కూడా మంచి సినిమాలను తీస్తూ ఉంటామని చెప్పింది.