తన సీక్రెట్స్ బయట పెట్టిన ప్రగతి..!!

-

సీనియర్ నటి కారెక్టర్ ఆర్టిస్ట్ అయిన నటి ప్రగతి ప్రస్తుతం కారెక్టర్ ఆర్టిస్ట్ గా  సినిమాల్లో బిజీ గా వున్న సంగతి తెలిసిందే.వయసు పెరుగుతున్న కొద్దీ , తన గ్లామర్ ను పెంచు కుంటు అందరిని అలరిస్తోంది. తాను మాస్ బీట్ పాటలకు వేసే డాన్స్ ల ,అలాగే తాను జిమ్ లో చేసే వర్కౌట్ వీడియోస్ సోషల్ మీడియాలో లో హల్చల్ చేస్తుంటాయి. తాజాగా ప్రముఖ ఛానల్ లో ఇంటర్వ్యూ సందర్భంగా తన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియచేసింది.

ఇందులో భాగంగా తనని అందరి లోకి డిఫెరెంట్ గా నిలబెట్టిన తన భుజానికి వున్న టాటూ గురించి సీక్రెట్ రివిల్ చేసింది.నాకు చిన్నప్పుడు వేసిన వ్యాక్సినేషన్‌ సెప్టిక్‌ అయింది. దానితో అది పెద్ద కాలిన మచ్చలాగా తయారు అయ్యింది. ఏమి చేయాలి అని ఆలోచిస్తుంటే ఒక రోజు వేరే వాళ్ళు టాటూ వేపించడం చూసి నేను కూడా టాటూ వేయించేశాను అని చెప్పుకొచ్చింది. అలాగే ఇప్పుడు ఈ టాటూనే నాకొక ప్రత్యేక మైన గుర్తింపును తెచ్చిపెట్టింది అని చెప్పింది.

అలాగే పరిశ్రమలో రెబెల్ ను అనే విషయం గురించి వివరణ ఇస్తూ  నేను జరిగిన విషయాన్ని మనసులో వుంచుకొని బాధపడే దాన్ని కాదు . అది మనసులో వుంటే నన్ను హర్ట్ చేస్తుంది. అందుకే  నన్ను బాధ పెట్టిన వారికి వెంటనే సమధానం ఇస్తాను. అలా స్పందించక పొతే నాకు నిద్ర పట్టదు. అందుకే చాలా మంది నన్ను రెబెల్ అనుకుంటారు అని చెప్పుకొచ్చింది

Read more RELATED
Recommended to you

Latest news