17, 18 న సికింద్రాబాద్ లో బోనాలు నిర్వహిస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. బోనాలు అత్యంత సంతోషకరమైన సమయమని.. బోనల్లో మొదటి బోనం జగదాంబికా అమ్మవారికి సమర్పించి బోనవాలు ప్రారంభిస్తున్నామన్నారు. వందల ఏళ్లుగా బోనాల జాతర జరుగుతోందని.. నగరంలోని ప్రతి ఆలయానికి ఆర్ధిక సాయం అందించిన ఘనత తెలంగాణదని వెల్లడించారు.
ఈ కార్యక్రమం కోసం అన్ని శాఖల సమన్వయంతో ముందుకు వెళతామని చెప్పారు. 17, 18 న సికింద్రాబాద్ లో బోనాలు అని.. 24,25 న లాల్ దర్వాజ బోనాలు నిర్వహిస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. బోనాలు మన సంస్కృతికి అద్దం పడుతుందని.. 8 ఏళ్లుగా రాష్ట్రంలో వైద్భావంగా బోనాలు ప్రత్యేకంగా చేస్తున్నామని స్పష్టం చేశారు. కుల మతాలకు అతీతంగా బోనాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 10 వ తేదీన బోనాలు, బక్రీద్ వేడుకలు ఉన్నాయి. అందరం కలిసి అని పండుగలు చేసుకోవాలని కోరారు తలసాని శ్రీనివాస్ యాదవ్.