ఈ సీజన్‌లో పియర్ ఫ్రూట్‌ను తింటున్నారా..? షుగర్‌ పేషంట్స్‌కు, ఊబకాయం ఉన్నవారికి బెస్ట్‌

-

ఆరోగ్యంగా ఉండాలంటే..కడుపునిండా తింటే సరిపోదు. ఆ తినేది హెల్తీ మీల్‌ అయిఉండాలి. మనదగ్గర పైసలుండాలే కానీ.. బాడీకి బలాన్ని ఇచ్చేవి, అవయవాలకు ఆయువుపోసేవి ఎన్నో ఉన్నాయి. సీజనల్‌ ఫ్రూట్స్‌ అంటే..ఎండకాలం మామిడి, వర్షాకాలం చర్రీస్‌, చలికాలం సిట్రస్‌ ఫ్రూట్స్‌ వరకే మనకు తెలుసు. మనకు తెలియనవి, మనం తిననివి ఆరోగ్యానికి మేలు చేసేవి చాలా ఉన్నాయి.. అలాంటిదే ఈ పియర్ ఫ్రూట్‌. వీటినే బెరీ పండు అని కూడా అంటారు. ఈ వర్షాకాలంలో బాగా లభిస్తాయి. ఇందులో పోషకాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి.

ఈ పండు తినడం వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు..

ఈ పండ్లలో తక్కువ మొత్తంలో కేలరీలు ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక.
పియర్‌లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి.. ఇది ఎముకలను దృఢంగా చేస్తుంది. ఎముకలు బలహీనపడకుండా కాపాడేందుకు ఇది పనిచేస్తుంది. ఎముకలు బలహీనంగా ఉన్నవారు ఇది తింటే మంచి కాల్షియం పడుతుంది.
పియర్‌లో ఐరన్‌ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ఇది మహిళల్లో రక్తహీనత లోపాన్ని నివారిస్తుంది. అందువల్ల, హిమోగ్లోబిన్ లోపం ఉన్నవారు బేరిని తినవచ్చు.
ఎనర్జీ లెవల్స్ పెంచడంలో సహాయపడే పోషకాలు ఈ పండులో పుష్కలంగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం ద్వారా, మీరు రోజంతా శక్తివంతంగా ఉంటారు. ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది.
పియర్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు ఈ పండుతింటే..జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
మధుమేహం ఉన్నవారికి కూడా.. ఈ పండు చాలా మేలు చేస్తుంది. ఇందులో ఫైబర్, యాంటీ డయాబెటిక్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి మధుమేహం సమస్యను తగ్గించేందుకు సహాయపడతాయి.
ఈ పండులో ఉండే ఫ్లేవనాయిడ్స్, విటమిన్ ఏ, సీ,యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్, ఫైబర్, ఫోలేట్ తదితర పోషకవిలువలు పియర్‌లో అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని డ్యామేజ్ చేసే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి.
ఈ పండను జ్యూస్ లేదా సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇది గుండె సంబంధిత సమస్యలను నివారిస్తుంది.
ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఈ సీజన్‌లో దొరికే ఈ పండును తినడం అస్సలు మిస్‌కావద్దని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news