BREAKING : సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు రద్దు అయ్యాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలను రద్దు చేస్తూ గెజిట్ విడుదల చేసింది కేంద్ర రక్షణ శాఖ. ఫిబ్రవరి 17న విడుదల చేసిన గెజిట్ ను కేంద్రానికి ఉన్న ప్రత్యేక అధికారులతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది కేంద్ర రక్షణ శాఖ. దీంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు రద్దు అయ్యాయి.
కాగా, మార్చి 1 నుంచి 4వ తేదీ వరకు కంటోన్మెంట్ ఎన్నికల ఓటర్ల సవరణ, కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పిస్తున్నట్లు గతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు వెల్లడించింది. మార్చి 23న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనుండగా, మార్చి 28, 29 తేదీల్లో అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపింది. ఏప్రిల్ 6న పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లను ప్రకటించి, ఏప్రిల్ 30న ఎన్నికలు నిర్వహిస్తారని వెల్లడించింది. కానీ ఆ ఎన్నికలు తాజాగా రద్దు అయ్యాయి.