ముస్తాబైన ఎర్రకోట.. భద్రత కట్టుదిట్టం!

-

దేశ రాజధాని ఢిల్లీలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఎర్రకోట ముస్తాబవుతోంది. ఈ వేడుకలకు ఏడు వేల మంది ఆహ్వానితులు హాజరు కానున్నారు. భద్రత కోసం సుమారు పది వేల మంది పోలీసులు మోహరించనున్నారు. రేపు ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. దీంతో ఎర్రకోట ప్రవేశ ద్వారం దగ్గర మల్టీ లేయర్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అలాగే ఫేషియల్ రికగ్నైజేషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు.

ఎర్రకోట-స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఎర్రకోట-స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పంద్రాగస్టు వేడుకలు ముగిసే వరకూ ఎర్రకోట చుట్టూ 5 కి.మీ. పరిధిలో నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. పతంగులు, డ్రోన్లు, చైనీస్ లాంతర్ల ఎగురవేతపై ప్రభుత్వం నిషేధం విధించింది. డీఆర్డీఓ, ఇతర రక్షణ విభాగాలు రూపొందించిన యాంటీ డ్రోన్, రాడార్ వ్యవస్థలను సిద్ధంగా ఉంచారు. అలాగే 400 మంది కైట్ క్యాచర్లను నియమించారు. అత్యంత నాణ్యమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, అనుక్షణం పర్యవేక్షిస్తున్నట్లు ఢిల్లీ ప్రత్యేక కమిషనర్ దీపేందర్ పాఠక్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news