గత నెల ఆగస్టు.. ఈ శతాబ్దంలోనే విపత్కరమైన నెల :మంత్రి సీదిరి అప్పలరాజు

-

శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ లో అగ్రికల్చరల్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి సీదిరి అప్పలరాజు, మాజీ డిప్యూటి సీఎం ధర్మాన కృష్ణదాస్, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. గత నెల ఆగస్టు ఈ శతాబ్దంలోనే విపత్కరమైన నెల అని ఆయన అన్నారు. నూట ఇరవై సంవత్సరాలక్రితం తీవ్ర వర్షాభావం ఏర్పడింది … ఇప్పుడు ఆగస్టులో అదే పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. రిజర్వాయర్ ల నీటి మట్టం కూడా పూర్తిగా పడిపోయిందని, రైతులు ఇబ్బందులు పడకూడదని రెండు సార్లు సిఏం జగన్ రివ్యూ చేసారన్నారు.

Seediri Appalaraju: జగన్ శాశ్వత ముఖ్యమంత్రిగా ఉంటారు.. చంద్రబాబు  రాష్ట్రానికి పట్టిన అరిష్టం - NTV Telugu

అంతేకాకుండా.. ‘అదృష్ట వసాత్తూ రెండు రోజులనుండి వర్షాలు పడుతున్నాయి. అచ్చెన్నాయుడు కి బ్రైన్ సైజ్ ఫుల్ ఫంక్షనింగ్ నిల్. అచ్చేన్నమాటలు రైతులు మద్య కోట్లాటలు జరిగేలా ఉన్నాయి. టెక్కలి – పలాస నియోజకవర్గ రైతులు కోట్లాడుకునే లా మాటలు ఉన్నాయి. అచ్చేన్న హాయాంలో ఏత్తిపోతల పథకాలు ఇష్టానుసారం నిర్మించారు గతంలో లిఫ్ట్ లు ఆన్ చేస్తే ..పలాస చివరి ఆయకట్టుకు నీరు అందడంలేదు. అచ్చెన్నాయుడు లాంటి దౌర్భాగ్యుడవల్లే జిల్లా వెనకపడింది. జిల్లాకు ఓక్కమంచి పని,ప్రోజేక్ట్ అయినా చేసారా అచ్చెన్నా.. మీ ఊరిలో స్కూల్ , హాస్పిటల్ సైతం మేమే కట్టించాం. రూల్స్ ప్రకారమే వంశధార నీటి సరఫరా జరుగుతోంది. రైతులను రెచ్చగోట్టే వ్యాఖ్యలు అచ్చేన్న చేయోద్దని హితవు పలుకుతున్నాం’ అని మంత్రి సీదిరి అప్పాలరాజు వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news