తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఇవాళ యువగళం పాదయాత్రలో భాగంగా పాలకొల్లులో శెట్టిబలిజ కులస్తులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు నారా లోకేష్. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. తెలుగుదేశం హయాంలోనే బీసీలకు పెద్ద పీట వేశామని, ఆర్ధికంగా తోడ్పాటునిచ్చామని అన్నారు. పాదయాత్రలో టీడీపీ హయాంలో బీసీలకు ప్రత్యేక కార్పొ రేషన్ ఏర్పాటు చేశారని నారా లోకేష్ చెప్పారు.
యువతకు రాయితీలపై రుణాలిచ్చి ఉపాధి కల్పించామని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ప్రస్తుత సీఎం జగన్ బీసీలకు వెన్నుపోటు పొడిచారని నారా లోకేష్ మండిపడ్డారు. కార్పొరేషన్లో నిధులు లేకుండా చేశారని ధ్వజమెత్తారు. కల్లు గీత కార్మికుల ఆర్థిక కష్టాలకు కారణమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు నారా లోకేష్. కల్లు గీత కార్మికుల సమస్యలు పట్టించుకో కుండా సమాజంలో వారి ఆత్మగౌరవం దెబ్బతినే రీతిలో ప్రవర్తిస్తున్నారని నారా లోకేష్ ఆక్షేపించారు. టీడీపీ అధికారంలోకి వస్తే బీసీలకు చక్కని అవకాశాలు కల్పిస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.