మాములుగా అసెంబ్లీ సమావేశాల్లో అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం చూస్తుంటాము. ఇది ఏ ప్రభుత్వంలోనూ కొత్త కాదు. అదే విధంగా ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ సమావేశాల సమయంలోనూ విపక్షాలకు చెందిన నాయకులకన్నా కూడా అధికార వైసీపీ కి అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాం మైక్ ను ఇస్తూ ఉంటారు. అదే సమయంలో ప్రతిపక్షాలు మైక్ అడిగినా ఏవేవో కారణాలు చెబుతూ ఇవ్వకపోవడమో లేదా ఒకవేళ ఇచ్చినా కొంచెం సేపటికే మైక్ కట్ చేయడమో చేస్తుంటారు.
ఇక తాజాగా స్పీకర్ సీతారాం విపక్షాలపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. సీతారాం అసెంబ్లీ లో జరిగే విషయాలను మాట్లాడుతూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కేవలం గొడవలు చేయడానికి అసెంబ్లీ కి వస్తున్నట్లు ఉందని మాట్లాడారు. మాట్లాడే సమయంలో ఏమి మాట్లాడుతున్నాము అన్నది గుర్తుంచుకుని మాట్లాడాలని సీతారాం సూచించారు.
.