ఐపీఎల్ లో ఈ రోజు పంజాబ్ మరియు కోల్కతా ల మధ్యన మ్యాచ్ జరుగుతోంది. మొదట బాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్ లలో అయిదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. రాజపక్స అర్ద సెంచరీతో రాణించాడు. కాగా పరుగుల లక్ష్యంతో ఛేదన స్టార్ట్ చేసిన కోల్కత్తాకు రెండవ ఓవర్ లోనే బిగ్ షాక్ తగిలింది. ఇండియా స్టార్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్ దీప్ సింగ్ రెండవ ఓవర్ లో మొదటి బంతికే మందీప్ సింగ్ ను అవుట్ చేసి పంజాబ్ కు శుభరంభాన్ని అందించాడు.
ఆ తర్వాత ఆఖరి బంతికి కోల్కతా ప్రయోగాత్మక బ్యాట్సమాన్ గా వచ్చిన బౌలర్ ఆల్ రౌండర్ అనుకుల్ రాయ్ ను అవుట్ చేసి ఒకే ఓవర్ లో కోల్కత్తాకు చుక్కలు చూపించాడు. దీనిథి భారీ లక్ష్యం ఉండగా రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది.