గత మార్చితో పోల్చితే ఈ ఏడాది మార్చి లో జీఎస్టీలో 13 శాతం వృద్ధి చెందినట్లు కేంద్రం వెల్లడించింది. మార్చి నెలలో రూ.1,60,122 కోట్ల మేర జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఇందులో కేంద్ర జీఎస్టీ రూ.29,546 కోట్లు కాగా… రాష్ట్రాల జీఎస్టీ రూ.37,314 కోట్లు అని వివరించింది. ఐజీఎస్టీ కింద రూ.82,907 కోట్లు వసూలైంది. ఐజీఎస్టీ వసూళ్ల పరంగా ఇది ఆల్ టైమ్ రికార్డు. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో ఐజీఎస్టీ వసూలు కాలేదు.
ఇక, మార్చి నెలలో సెస్ ల రూపంలో రూ.10,355 కోట్లు వసూలైనట్టు కేంద్రం తెలిపింది. మొత్తమ్మీద గత మార్చి నెలతో పోల్చితే ఈ మార్చి నెల వసూళ్లలో 13 శాతం వృద్ధి నమోదైంది. కాగా, జీఎస్టీ తీసుకువచ్చాక ఇప్పటివరకు రెండు పర్యాయాలు మాత్రమే వసూళ్లు రూ.1.6 లక్షల కోట్లు దాటాయి. మార్చినెలకు సంబంధించిన జీఎస్టీ వసూళ్ల వివరాలను కేంద్రం వెల్లడించింది. వరుసగా 12వ నెల కూడా రూ.1.4 లక్షల కోట్లకు పైగా జీఎస్టీ వసూలైంది.