వ్యవసాయశాఖలో అదనంగా 1000 పోస్టులు : తెలంగాణ మంత్రి

-

వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కేంద్రంపై విరుచుకుపడ్డారు. కేంద్రం అవసరం అయిన పని చేయకుండా… ఏక పక్షంగా గెజిట్ విడుదల చేసిందని ఫైర్‌ అయ్యారు. కేంద్రం గెజిట్ రాజ్యాంగ విరుద్ధమని.. గెజిట్ పై రెండు జాతీయ పార్టీలకు స్పష్టమైన వైఖరి లేదని నిప్పులు చెరిగారు. కృష్ణా నది జలాలపై తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎరువులకు సంబంధించి ఎటువంటి కొరత లేదని… ఎరువుల సరఫరా లో జాప్యం లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని రేపు ఢిల్లీలో కలుస్తామని తెలిపారు. తెలంగాణ ప్రతి ఏటా పంట విస్తీర్ణం పెరుగుతోందని… వ్యవసాయ శాఖలో ఖాళీలను గుర్తిస్తున్నారని వెల్లడించారు.

వ్యవసాయ శాఖకు అవసరం అయితే అదనంగా వెయ్యి పోస్టులు మంజూరు చేస్తామని కేసీఆర్ అన్నారని స్పష్టం చేశారు. హమాలి పనిపై తాను చేసిన కామెంట్స్ ను తప్పుగా అన్వయించారని మండిపడ్డారు. యువత మనోభావాలను దెబ్బతీసేలా తాను ఎప్పుడూ మాట్లాడలేదని.. యువత ఎవరు బాధ పడవద్దని పేర్కొన్నారు. చదువుకున్న నిరుద్యోగ యువత ప్రిపేర్ కావాలని…నోటిఫికేషన్లు రాబోతున్నాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news