వాల్మీకి హిట్ తో మంచి జోష్ మీద ఉన్న వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రాన్ని కిరణ్ కొర్రపాటి డైరెక్షన్ లో మొదలు పెట్టబోతున్నాడు. వాల్మీకి హిట్ తర్వాత వరుణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ యేడాది ఇప్పటికే ఎఫ్ 2 లాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌తో పాటు ఆ తర్వాత గద్దలకొండ గణేష్ (వాల్మీకి) హిట్‌తో టైర్ టు హీరోల్లో స్టార్ హీరో రేంజ్‌కు వెళుతున్నాడు. ఈ క్రమంలోనే వరుణ్ నటించే నెక్ట్స్ సినిమా కోసం తన అన్న చరణ్ హీరోయిన్ను సంప్రదిస్తున్నారట.
వరుణ్ అన్న రామ్ చరణ్‌తో వినయ విధేయరామ లో నటించిన కియారా అద్వానీ ని వరుణ్ తదుపరి చిత్రం కోసం సంప్రదిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. మరి కియారా అద్వానీ ప్రస్తుతం బాలీవుడ్ టాప్ రేంజ్ హీరోయిన్. ఆమె వరుస సినిమాలతో బాగా బిజీ అయ్యింది. ఒకప్పుడు తెలుగులో మహేష్‌బాబుతో భరత్అనే నేను సినిమాలో నటించినప్పుడు ఆమెకు అక్కడ అంత పెద్ద అవకాశాలు లేవు.
ఇప్పుడు బాలీవుడ్లో బిజీ హీరోయిన్ అవ్వడంతో ఆమె తెలుగు వైపు చూడడం లేదంటున్నారు. మరి ఇప్పుడు వరుణ్ సరసన నటించేందుకు ఆమె ఓకే చెపుతుందో ? లేదో గాని వరుణ్ సినిమా టీం మాత్రం ఆమె కోసం ఎంతో ఆశతో వెయిట్ చేస్తోందట. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలీవుడ్లో టాప్ రేంజ్ హీరోయిన్గా ఉన్న కియారా అద్వానీ తెలుగులో మీడియం రేంజ్ హీరో వరుణ్ తేజ్ పక్కన నటించాలంటే… ఎంత డిమాండ్ చేస్తుందో.. నిర్మాతలు ఎంత సమర్పించాల్సి ఉంటుందో అన్నది కూడా టాలీవుడ్లో హాట్ డిస్కర్షన్‌గా మారింది.