టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి ప్రాతినిధ్యం వహించిన చింతకాయల అయ్యన్నపాత్రుడు మరోసారి సెంటరాఫ్‌ది పాలిటిక్స్ అయ్యారు. ఆయన స్వపక్షంలోనే విపక్ష నాయకుడిగా ఉంటారనే పేరు తెచ్చుకున్నారు. పార్టీలో ఆయన ఎవరిపైనైనా విమర్శలు చేగలిగిన దిట్ట. ఈ క్రమంలోనే విశాఖ నేతలనుగతంలో చాలా సార్లు టార్గెట్ చేసుకున్నారు. ముఖ్యంగా మంత్రిగా ఉన్న సమయంలోనే విశాఖ భూముల విషయంలో భారీ ఎత్తున అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు కేంద్రంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీ అధికారంలో ఉండడం, భారీ ఎత్తున సంచలనం కావడం కూడా తెలిసిందే.
ఇక, ఈ వ్యాఖ్యలతో అప్పట్లో అధికారంలో ఉన్న సమయంలోనే చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. వెం టనే సిట్ ఏర్పాటు చేశారు. ఇదిలాసాగుతున్న క్రమంలోనే అయ్యన్న ఎప్పటికప్పుడు వీలు చిక్కినప్పుడ ల్లా పార్టీ నేతలపై విరుచుకుపడేవారు. గంటాపై వ్యక్తిగతంగాను విమర్శలు చేశారు. సరే! ఎన్నికలు ముగిశా యి.. అయ్యన్న ఓడిపోయారు. కానీ, గంటా మాత్రం ఉత్తర విశాఖ నియోజకవర్గం నుంచి విజయం సాధిం చారు. ఇక, రాష్ట్రంలో అధికారం కూడా మారిపోయింది. కానీ, మారనిదల్లా అయ్యన్నేనని అంటున్నారు పరిశీలకులు. ఆయన వ్యవహారంలోనూ ఎలాంటిమార్పూ రాలేదని చెబుతున్నారు.
ఒకపక్క పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయి, అధినేత చంద్రబాబుకు ఇంటా బయటా పోరు పెరిగి.. రాష్ట్రం లో పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయిన పరిస్థితిలో పార్టీకోసం సూచనలు సలహాలు ఇవ్వాల్సిన అయ్యన్న ఆ విషయాన్ని పక్కన పెట్టి.. మరోసారి సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేశారు. పార్టీ నాయకులకు బహిరంగంగా మాట్లాడే దమ్ము లేకపోతే, జగన్‌తో బంధుత్వం ఉంటే వెళ్లి ఇంట్లో కూర్చోవాలి. భూములు దోచేవాడు, ఖూనీలు చేసేవాడే రాజకీయాలు చేసే రోజులు వచ్చాయనిపిస్తోంది.
అని పరోక్షంగా పార్టీ సీని యర్లపై అయ్యన్న విమర్శలు గుప్పించారు. విజయవాడ సమీపంలో నిన్న జరిగిన టీడీపీ విస్తృత స్థాయి భేటీలోఆయన మాట్లాడారు. మరి ఈ విమర్శలతో గంటా సహా ఎంత మంది నేతలు ఉలిక్కి పడి ఉంటారో నని అనిపిస్తోంది. అయితే పార్టీ ఇన్ని కష్టాల్లో ఉండగా కూడా.. అయ్యన్న ఇలా సొంత పార్టీ నాయకులను టార్గెట్ చేయడం సరైనదేనా అనే చర్చకూడా సాగుతుండడం గమనార్హం.