ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఐపీఎస్ సంజయ్ పై విచారణకు గ్రీన్ సిగ్నల్

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీఐడీ చీఫ్ గా, ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్న సమయంలో ఏపీఎస్ సంజయ్ పెద్ద ఎత్తున అవినీతి పాల్పడ్డారనే ఆరోపణలు సర్వత్రా వెల్లు వెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయన పై విచారణకు ఆదేశించింది. ఇటీవలే విజిలెన్స్ అధికారులు లోతైన విచారణ జరిపి అక్రమాలు జరిగినట్టుగా నిగ్గు తేల్చారు. వారు ఇచ్చిన రిపోర్టు మేరకు ఇటీవల సీఎస్ నిరభ్ కుమార్ ప్రసాద్ సంజయ్ ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఆల్ ఇండియా సర్వీసెస్ డిసిస్లేవ్ యాక్ట్-1969లోని సెక్షన్ 3(1) కింద చర్యలు తీసుకుంది. ఫైర్ డిపార్ట్ మెంట్ లో జరిగిన అక్రమాలపై విచారణ చేయాలని ఏసీబీ అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం జరిగిన అవినీతి పై ఏసీబీ అధికారులు విచారన ముమ్మరం చేశారు. యాంటీ కరెప్షన్ యాక్ట్ 17-ఏ ప్రకారం.. ఓ ప్రభుత్వ అధికారి పై విచారణ జరపాలంటే ఆయనను తొలగించే అధికారం ఉన్న అధికారి అనుమతి తప్పనిసరిగ్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆయనను ప్రాసిక్యూషన్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ అధికారులు సర్కార్ ను రిక్వెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news