మనోజ్ అన్న ఆ ఒక్క మాటకి అందరి ముందే ఏడ్చేసిన మౌనిక

-

మంచు మనోజ్ – మౌనిక రెడ్డి వివాహం ఇటీవల మంచు లక్ష్మీ నివాసంలో జరిగింది. ఈ పెళ్లికి పలువురు ప్రముఖులు , రాజకీయ నాయకులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ క్రమంలోనే ఈ జంట తాజాగా తిరుమల స్వామి వారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ.. మౌనిక తో తనకు 12 ఏళ్లుగా పరిచయం ఉందని నాలుగేళ్లుగా ఇద్దరం చాలా బాధలు పడ్డాం అంటూ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. అయితే.. తాజాగా మనోజ్ అన్న ఆ ఒక్క మాటకి అందరి ముందే ఏడ్చేసింది మౌనిక.

సినిమా చేసి ఆరేళ్లయిన తనపై ప్రేమ చూపిస్తున్న ప్రేక్షకులకు మంచు మనోజ్ ధన్యవాదాలు తెలిపారు. జీవితంలో చీకటి కమ్ముకున్నప్పుడు పేరెంట్స్, అక్క ఎంతో సపోర్ట్ చేశారన్నారు. “నేను ముందుకెళ్దాం అనుకున్నప్పుడు మౌనిక రూపంలో వెలుతురు కనిపించింది. నేను ప్రేమించిన అమ్మాయి కూడా స్వేచ్ఛగా ఉండాలి. ఆమె ఏం చేసినా సపోర్ట్ చేస్తాను” అని MBU వార్షికోత్సవంలో చెప్పారు. ఆయన మాటలకు భార్య మౌనిక కన్నీరు పెట్టుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news