కరోనావైరస్ కారణంగా వాయిదా పడిన చాలా కామన్ ఎంట్రన్స్ పరీక్షలను అన్‌లాక్ 4.0 ప్రారంభమైన నేపథ్యంలో నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి అనేక రాష్ట్రాలు. ఇప్పటికే టీఎస్ ఈసెట్ పరీక్ష పూర్తి అవ్వగా.. ఇప్పుడు టీఎస్ ఎంసెట్ నిర్వహణ కోసం పరీక్ష కోసం ప్రభుత్వం రెడీ అయిపోవడం.. పరీక్షల తేదీలను జెఎన్టీయూ విడుదల చేయడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు తాజాగా.. టీఎస్ ఎంసెట్ అప్లై చేసుకోడానికి సెప్టెంబర్ 5 వరకు గడువు పొడగించింది. అప్లై చేసుకోడానికి ఇవాళే చివరి తేది. అప్లై చేసుకోనివారు అధికారిక వెబ్‌సైట్ eamcet.tsche.ac.inలో అప్లై చేసుకోవచ్చు.
ఇందుకు లేట్ ఫీ 10000 చెల్లించాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్నవారు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్ష సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 14 వరకు జరుగతుంది. ఇందుకోసం తెలంగాణ లో 79 , ఏపీలో 23పరీక్ష కేంద్రాలతో మొత్తం 102 సెంటర్లను ఏర్పాటు చేసింది. ఈ ఎంసెట్ ఎగ్జామ్ ను 1లక్ష 43 వేల 165 మంది పరీక్ష రాయనున్నారు.