Serum Institute : సీరం నుంచి మరో కీలక వ్యాక్సిన్

-

గర్భాశయ క్యాన్సర్ నివారణకు త్వరలోనే వ్యాక్సిన్ రానుంది. దీనికి కొత్త వ్యాక్సిన్​ను తీసుకురాబోతున్నట్లు సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా సీఈఓ అదర్​ పూనావాలా తెలిపారు. దేశీయంగా అభివృద్ధి చేసిన క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (క్యూహెచ్​పీవీ) వ్యాక్సిన్​ను అందుబాటులోకి తెస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దీని ధర రూ. 200-400 ఉంటుందని పూనావాలా తెలిపారు.

“గర్భాశయ క్యాన్సర్‌ నివారణకు సంబంధించిన వ్యాక్సిన్​ ఇతర టీకాల ధర కన్నా తక్కువగా ఉంటుంది. ఈ ఏడాది చివరినాటికి వ్యాక్సిన్ విడుదల చేసేందుకు ప్రయత్నిస్తాం. 200 మిలియన్ల వ్యాక్సిన్ డోస్‌లను తయారు చేసే ప్రణాళిక చేస్తున్నాం. ముందుగా భారత్​లో వ్యాక్సిన్​ను పంపిణీ చేస్తాం. దేశ అవసరాల తీరాక విదేశాలకు ఎగుమతి చేస్తాం. వచ్చే ఆరు నెలల్లోపే ఒమిక్రాన్‌ వేరియంట్‌ను నిరోధించే వ్యాక్సిన్‌ తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తాం. భారత్‌లో బూస్టర్‌ డోసుగా గతంలో తీసుకున్న టీకాలే ఇస్తున్నారు. అయితే, ఒమిక్రాన్‌పై పోరాడే వ్యాక్సిన్‌ కోసం నోవావాక్స్‌తో కలిసి పనిచేస్తున్నాం. బూస్టర్‌గా ఈ వ్యాక్సిన్‌ ఎంతో మేలు చేస్తుంది.” అని అదర్​ పూనావాలా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news