సెష‌న్ రిపోర్ట్ : మ‌ళ్లీ గెలుపు టీడీపీదే ! పెగాస‌స్ వార్  

-

అసెంబ్లీ లో నిన్న‌టి వేళ పెగాస‌స్ దుమారం రేగింది.ఇదే స‌మ‌యంలో మాజీ ఇంటెలిజెస్స్ డీజీ ఏబీ వేంక‌టేశ్వ‌ర్లు మీడియా ముందుకు వ‌చ్చి కొన్ని విష‌యాలు చెప్ప‌డంతో అధికార ప‌క్షాన్ని టార్గెట్ గా చేసుకుని టీడీపీ కొన్ని వ్యాఖ్య‌లు చేసింది మ‌రియు వాగ్బాణాలు సంధించింది.  సభ‌లో తీవ్ర గంద‌ర‌గోళ వాతావ‌ర‌ణం నెల‌కొన‌డంతో  స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం దిగివ‌చ్చారు. టీడీపీ
కోరిన విధంగా స‌భా సంఘం నియ‌మించేందుకు అంగీకారం తెలిపారు.

ఇదే స‌మ‌యంలో వైసీపీ స‌భ్యులు కూడా ఇదే డిమాండ్ ను రైజ్ చేయ‌డంతో స్పీక‌ర్  ఇరు ప‌క్షాల‌కూ స‌మ్మ‌తి ఇచ్చే విధంగా  ప్ర‌వ‌ర్తించి ఎట్ట‌కేల‌కు స‌భ్యుల కోరిక‌ను ప‌రిగ‌ణించి స‌భా సంఘం వేసేందుకు స‌మ్మ‌తించ‌డంతో తెలుగుదేశం పార్టీ తో పాటు అటు వైస్సార్సీపీ కూడా శాంతించింది. వాస్త‌వానికి  తెలుగుదేశం హయాంలో 2019 మే వ‌ర‌కూ తాను ఇంటెలిజెన్స్ విభాగాధిప‌తిగా ఉన్నాన‌ని,త‌న హయాంలో ఏ ప్ర‌భుత్వ సంస్థ కానీ ఏ ప్ర‌యివేటు సంస్థ కానీ పెగాస‌స్ స్పై వేర్ కొనుగోలు చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. 2019 మే త‌రువాత ఏం జరిగిందో త‌న‌కు తెలియ‌ద‌ని స్ప‌ష్టం చేశారు.

ఇక ఈ వివాదానికి సంబంధించి వైసీపీ చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో నిజానిజాలు తేల్చాల్సిన త‌రుణం వ‌చ్చేసింది.మ‌మ‌తా బెన‌ర్జీ చెప్పిన విధంగా టీడీపీ స‌ర్కారు కొనుగోలు చేసి ఉంటే అప్పుడు వైసీపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అన్న‌ది చూడాలి.అయితే తాము కొనుగోలు చేయ‌లేద‌ని, ఒక‌వేళ కొనుగోలు చేసిన ప్ర‌భుత్వం వ‌ద్దే ఆ సాఫ్ట్ వేర్ ఉంటుంద‌ని కూడా టీడీపీ ప‌దే ప‌దే అంటోంది.

దీనిపై  స‌భ‌లో రేగిన దుమారం కార‌ణంగా అనూహ్యంగా వైసీపీ కూడా స‌భా సంఘం ఏర్పాటుకు ప‌ట్టుబ‌ట్ట‌డం ఓ విధంగా విశేష‌మే ! వాస్త‌వానికి నిన్న‌టి స‌భ‌లో మ‌మ‌తా బెన‌ర్జీ చేసిన వ్యాఖ్య‌ల‌పైనా అదేవిధంగా స్పై వేర్ కొనుగోలుకు సంబంధించిన అంశాల‌పైనా మాట్లాడేందుకు స‌మ‌గ్ర రూపాన చ‌ర్చించేందుకు  వైసీపీ ప‌ట్టుబ‌ట్టినా టీడీపీ తీవ్ర స్థాయిలో అభ్యంత‌రం తెలిపింద‌ని ప్ర‌ధాన మీడియాలో ప్ర‌చురితం అయిన వార్త సారాంశం.ఈ ద‌శ‌లోనే ఆర్ధిక మంత్రి బుగ్గ‌న జోక్యం చేసుకుని గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో 2014 నుంచి 2019 వ‌ర‌కు చోటు చేసుకున్న అక్ర‌మాల‌పై సభా సంఘం ఏర్పాటుకు ప‌ట్టుబ‌ట్ట‌డంతో స్పీక‌ర్ కూడా అటు టీడీపీ మాట‌కూ, ఇటు వైసీపీ మాట‌కూ స‌మ ప్రాధాన్యం ఇచ్చి స‌భా సంఘం  నియ‌మించేందుకు  సానుకూల వైఖ‌రి వ్య‌క్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news