ఐదో పెళ్లికి తండ్రి సిద్ధం.. అడ్డుకున్న ఏడుగురు పిల్లలు

-

ఓ వ్యక్తి ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారు. అతడికి ఏడుగురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆ వ్యక్తి మరో వివాహానికి సిద్ధమయ్యాడు. దీంతో విషయం తెలిసిన అతడి రెండో రెండో భార్య, ఏడుగురు పిల్లలు పెళ్లిని అడ్డుకున్నారు. పెళ్లి కుమారుడిగా ముస్తాబైన అతడిపై దాడికి దిగారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. యూపీలోని మొహల్లా పటియాలాకు చెందిన 55 ఏళ్ల ఓ వ్యక్తి రోడ్డు కాంట్రాక్టర్‌గా పని చేస్తుంటాడు.

పెళ్లి-విడాకులు
పెళ్లి-విడాకులు

ఇతడికి గతంలో నాలుగు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యకు ఏడుగు సంతానం. ఆమెకు కూడా విడాకులు ఇచ్చి దూరమయ్యాడు. అనంతరం రహస్యంగా మరో రెండు పెళ్లిళ్లు కూడా చేసుకున్నాడు. ఈ విషయం అతడి కూతురికి తెలిసింది. ఈ క్రమంలో ఆ వ్యక్తి మరో వివాహానికి సిద్ధమయ్యాడు. విషయం తెలిసిన రెండో భార్య, పిల్లలు తమ బంధువులతో వచ్చి పెళ్లిని అడ్డుకున్నారు. అతడిపై దాడికి దిగారు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేసుకుని, ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news