ఇండియన్-2లో ఏడుగురు విలన్లు?

-

స్టార్‌ దర్శకుడు శంకర్ డైరక్షన్ లో రెండు దశాబ్ధాల క్రితం రిలీజైన సినిమా ఇండియన్. అప్పట్లో సంచలన విజయం అందుకున్న ఈ సినిమాకు సీక్వల్ గా ఇన్నాళ్లకు ముహుర్తం కుదిరింది. శంకర్, కమల్ మళ్లీ అదే కాంబినేషన్ లో ఇండియన్ సీక్వల్ గా ఇండియన్-2 వస్తుంది.

లైకా ప్రొడక్షన్స్ లో సుభాస్కరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా, డైరెక్టర్ శంకర్, హీరో కమల్ హాసన్ కాంబినేషన్ లో ఇండియన్-2 సినిమా శరవేగంగా తెరకెక్కుతోంది. ఇందులో సముద్రఖని సహా ఏడుగురు విలన్లు, ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారని కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. త్వరలోనే పూర్తి వివరాలను మేకర్స్ వెల్లడిస్తారని సమాచారం. కాగా ప్రస్తుతం చెన్నైలో భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news