గోదావరి ఎక్స్​ప్రెస్ ఘటన.. LHB బోగీలతో తప్పిన ముప్పు

-

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సమీపంలో బుధవారం రోజున గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రమాదానికి గురైనవి ఎల్‌హెచ్‌బీ (లింకు హాఫ్‌మన్‌ బుష్‌)బోగీలు కావడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే.. ఈ బోగీలను యాంటీ టెలిస్కోపిక్‌ టెక్నాలజీతో రూపొందించారట.

దీనివల్ల పట్టాలు తప్పినప్పుడు కోచ్‌లు విడిపోతాయట. రెండు బోగీలు ఢీకొట్టుకోవడం.. పక్కకు పడిపోవడం లాంటి ఘటనలు చోటుచేసుకోవని అధికారులు తెలిపారు. ఆటోమేటిక్‌ బ్రేక్‌ సిస్టమ్‌, ఎయిర్‌ డిస్కు బ్రేకులు ఉండడంతో కూడా ఒక బోగీపైకి మరొకటి వెళ్లలేదని చెప్పారు.

గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో దాదాపు 1500 మంది ప్రయాణిస్తున్నారని రైల్వే అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. పట్టాలు తప్పిన 6 బోగీల్లో ఒకటి జనరల్‌ బోగీ కాగా అందులో 120 మంది వరకూ ప్రయాణికులుంటారని అంచనా వేశారు. ఒకటి సరకు రవాణా బోగీ. మిగతా 4 స్లీపర్‌ క్లాస్‌వి. ఈ నాలుగింటిలో 300 మంది వరకూ ఉంటారని అధికారులు అంచనా వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news