హైదరాబాద్ మహానగరంలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు అయింది. మెహదీపట్నంలో నివాసం ఉంటున్న షహనాజ్, హజీరా అనే యువతులు హైదరాబాద్ నగరాన్ని చూపిస్తామని చెప్పి ఓ మైనర్ బాలికను బంగ్లాదేశ్ నుంచి తీసుకువచ్చారు.
ఆ మహిళ హైదరాబాద్ వచ్చిన అనంతరం ఓ హోటల్ గదిలో బంధించి బలవంతంగా వ్యభిచారం చేయించారు. అయితే వారి నుంచి చాకచక్యంగా తప్పించుకున్న బాలిక బండ్లగూడ పోలీసులకు సమాచారం అందించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు.