గంభీర్‌పై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేసిన అఫ్రిదీ..!

టీమిండియా దిగ్గజం గౌతమ్ గంభీర్‌పై పాక్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదీ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ‘ఓ క్రికెటర్‌గా, బ్యాట్స్‌ మన్‌గా గంభీర్‌ను నేనెప్పుడూ ఇష్టపడుతాను. కానీ ఓ మనిషిగా మాత్రం అతనంటే నాకు నచ్చదు. అతను మాట్లాడే మాటలు, చేసే పనులు చూస్తే అతనికి ఏవో మానసిక సమస్యలున్నట్లు అనిపిస్తుంది. ఈ విషయాన్ని గంభీర్ మానసిక నిపుణుడు(ప్యాడీ ఆప్టన్) కూడా చెప్పాడు’ అని అఫ్రిది ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

ఇక గంభీర్, అఫ్రిది మధ్య మాటల యుద్దం కొత్తేం కాదు. క్రికెట్ మైదానం నుంచి కొనసాగుతూనే ఉంది. ఆటను వదిలినా.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న ప్రతీసారి చెరోమాట అనుకోవడం సర్వసాధారణమైపోయింది. ఆ మధ్య భారత ప్రధానిపై అఫ్రిది అనుచిత వ్యాఖ్యలు చేయగా.. గంభీర్ తిప్పికొట్టాడు. ఇప్పటికి పాకిస్థాన్ అన్నా.. ఒంటి కాలుపై లేస్తుంటాడు.