ASIA CUP 2022 : టీమిండియాతో మ్యాచ్‌కు ముందు పాక్‌కు ఎదురుదెబ్బ

-

ASIA CUP 2022 : ఆసియా కప్‌ సూపర్‌ 4 లో భాగంగా ఇవాళ.. భాగంగా టీమిండియాతో పాక్‌ మరోసారి తలపడనుంది. ఈ మ్యాచ్‌ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుండగా… దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగుతోంది. అయితే.. టీమిండియాతో మ్యాచ్‌ కు ముందు పాకిస్తాన్‌ కు భారీ షాక్‌ తగిలింది.

ఆ జట్టు పేసర షాహనవాజ్‌ దహనీ పక్కటెముకల గాయంతో టీమిండియా మ్యాచ్‌ కు దూరమయ్యాడు. నిజానికి హాంగ్‌ కాంగ్‌ తో మ్యాచ్‌ లో బౌలింగ్‌ చేస్తూనే దహనీ గాయపడ్డాడు. అయితే.. మ్యాచ్‌ లో దహనీ తన కోటా ఓవర్లను పూర్తి చేశాడు. కాగా.. టీమిండియాతో మ్యాచ్‌ కు దహనీ స్థానంలో ముహ్మద్ హస్నైన్‌, హసన్‌ అలీలలో ఎవరో ఒకరు తుది జట్టులోకి వచ్చే ఛాన్స్‌ ఉంది. ఈ విషయాన్ని పాక్‌ బోర్డు పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news