బిగ్ బాస్ ఆరవ సీజన్లో రెండవ వారం జరుగుతున్న నేపథ్యంలో 21 మంది కంటెస్టెంట్ లు కూడా చాలా హుషారుగా ఆటలు ఆడుతూ విన్నర్ అవ్వడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే కొట్లాటలు, గొడవలు అన్నీ జరుగుతున్నాయి. అయితే కొంతమంది మాత్రం గేమ్ ఆడకుండా కేవలం తినడానికి, బతకాని పెట్టడానికే వచ్చారంటూ నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున చివాట్లు పెట్టారు.
ఎవరెవరు ఏం చేస్తున్నారో చెప్పి క్లాస్ తీసుకున్నారు నాగ్. నాగార్జున కూడా మస్తు ఫైర్ మీద కనిపించాడు. బాలాదిత్య, షానీ, సుదీప, వాసంతి, శ్రీ సత్య, మెరీనా, రోహిత్, అభినయ, కీర్తి, శ్రీహాన్ ఇలా తొమ్మిది మందిని పక్కన పెట్టి అసలు గేమ్ ఆడటానికి వచ్చారా లేక తినడానికి, టైం పాస్ కి వచ్చారా అని సీరియస్ అయ్యాడు నాగ్.
ఇక హౌస్ లో వరస్ట్ కంటెస్టెంట్స్ గా ఎవరిని ఎంచుకుంటారు అని నాగ్ చెప్పగా, శ్రీ సత్య, షానీ, వాసంతి లను ఎంచుకున్నారు. ఈ ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని చెబుతూనే షానిని ఎలిమినేట్ చేసి బయటకు పంపేశారు నాగార్జున. ఇక ఇంటి సభ్యుల ఓటింగ్, ఆడియన్స్ ఓటింగ్ లతో మ్యాచ్ అయిందని షానీని ఎలిమినేట్ చేశారు.