ప్రస్తుతం కాంగ్రెస్‌లో రాజకీయాలు చాలా జోరుమీదున్నాయి. నిన్ననే రేవంత్‌రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్‌గా ప్రమాణం చేయడంతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ congress సీనియర్ల అసంతృప్తితో ఆ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. దీంతో అసలు పార్టీలో ఎవరు ఉంటారో ఎవరు ఉండరో అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఇక కాంగ్రెస్‌లో కీలకంగా ఉంటున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఆయనకు టీపీసీసీ ఇస్తారనే ప్రచారం జరిగినప్పటికీ ఇవ్వకపోవడంతో ఆయన నిన్న రేవంత్ ప్రమాణ స్వీకారానికి కూడా రాలేదు. ఇక ఆయన ఇప్పడు వైఎస్ షర్మిల వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది.
షర్మిల ఈరోజు పార్టీని ప్రకటించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో ఆమె పార్టీ ఏర్పాట్లు చేసుకుంటున్న జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వద్దకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అనుకోకుండా వచ్చి నిలిచారు. అక్కడ ఉన్న వైఎస్సార్ అభిమానులతో కాసేపు సరదాగా మాట్లాడి షర్మిలకు ఆల్‌ది బెస్ట్ చెప్పారు. వైఎస్సార్ గొప్ప నాయకుడని కొనియాడారు. దీంతో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. కాంగ్రెస్ ఎంపీ అయి ఉండి షర్మిలకు సపోర్టు చేయడమేంటని మండిపడుతున్నారు. మరి ఆయన ఒకవేళ షర్మిల వర్గంలో చేరుతారు అనే ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి. చూడాలి మరి కోమటిరెడ్డి ఎటు వైపు పయనిస్తారో.