కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలపై వైయస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న మోడీ, కెసిఆర్ ప్రభుత్వాలను పాత రేయాలని పిలుపునిచ్చారు వైయస్ షర్మిల. ఆరుగాలం పండించిన పంటను అమ్ముకోలేక కల్లాల్లో రైతు గుండెలు ఆగిపోతుంటే, ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు వరి మీద కిరికిరి పెడుతూ, కల్లాల్లో కయ్యాలు పెడుతూ, హస్తినలో దోస్తానా చేస్తూ, ధర్నాల డ్రామాలతో పంటను కొనకుండా రైతులను చనిపోయేలా చేస్తున్నాయని ఫైర్ అయ్యారు.
రైతు ఆవేదన తీర్చేవారే లేరని… రైతు చనిపోతే కనీసం ఆ రైతు కుటుంబాలను ఓదార్చే దిక్కు లేదని మండిపడ్డారు. రైతులను కోటీశ్వరులు చేశామని చెప్పుకొంటూ రైతులను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నఈ రైతు హంతక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పాతరేద్దామన్నారు. దానికోసం ఈ జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ తీసుకుందామని పిలుపు నిచ్చారు వైఎస్ షర్మిల. ఇలాంటి ప్రభుత్వాలకు రైతులు, ప్రజలు తగిన బుద్ది చెప్పాలని కోరారు వైఎస్ షర్మిల.