ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్….’సార్‘ గా తెలుగు ఆడియన్స్ ముందుకు వస్తున్న ధనుష్..

కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ ధనుష్ తెలుగు ప్రేక్షకులను నేరుగా అలరించబోతున్నారు. ధనుష్ ఎన్నాళ్ల నుంచో స్ట్రెయిట్ తెలుగు సినిమాలో నటించాలని కోరుకుంటున్నారు. రఘువరణ్ బీటెక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైన ధనుష్ ఆతరువాత మారి, వీఐపీ సినిమాలతో తెలుగు ఆడియన్స్ ను అలరించారు. తాజాగా ’సార్ ‘ అనే చిత్రం ద్వారా తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేస్తున్నారు. దీన్ని తమిళంలో ’వాతి‘గా నిర్మిస్తున్నారు.

గతంలో రంగ్ దే, తొలిప్రేమ చిత్రాలకు దర్శకత్వం వహించిన వెంకీ అట్లూరి దర్శకత్వంతో ధనుష్ సార్ సినిమా రాబోతోంది. తమిళంలో ’వాతి‘ అనే టైటిల్ తో ఈ సినిమా రాబోతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్ లపై నిర్మించనున్న ఈ సినిమాకు  జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సంయుక్త హీరోయిన్‌గా నటిస్తోంది. ఈవిషయాన్ని తెలియజేస్తూ మూవీ మేకర్స్ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. 

ఇప్పటికే బాలీవుడ్ లో రాంజానా సినిమాతో భారీ హిట్ కొట్టిన ధనుష్… అక్కడ ఆడియన్స్ కు దగ్గరయ్యారు. తాజాగా అక్షయ్ కుమార్ తో కలిసి అత్రంగిరే సినిమాలో నటిస్తున్నారు. జాతీయ స్థాయిలో ఇప్పటికే రెండు సార్లు ఆడుకాలం, అసురన్ సినిమాలకు జాతీయస్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డ్ వచ్చింది. ఇప్పటికే కార్తీ వంటి తమిళనటులు నేరుగా తెలుగు సినిమా చేయాగా… ఇళయ తలపతి విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంతో స్ట్రేయిట్ తెలుగు సినిమా చేస్తున్నారు.