ఆస్తుల పంపకంలో షర్మిలకు అన్యాయం జరిగింది : విజయమ్మ

-

ఆస్తుల పంపకంలో మా పాప షర్మిలకు అన్యాయం జరిగిందని వైఎస్ విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఓ లేఖలో విజయమ్మ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఓ తల్లిగా తనకు జగన్, షర్మిల ఇద్దరూ సమానమే అని చెప్పారు. కానీ ఓ బిడ్డ ఇంకో బిడ్డకు అన్యాయం చేస్తుంటే.. చూసి తట్టుకోవడం కష్టంగా ఉందని వ్యాఖ్యానించారు. “అన్యాయం జరిగిన బిడ్డ పక్షాన ఉండి మాట్లాడటం నా ధర్మం. నా విధి. ఇ:త మంది పెద్దలు చెబుతున్న అబద్ధాల మధ్య వాస్తవాలు తెలియాలనే నేను మీ ముందుకు వచ్చాను.

వైఎస్సార్ బతికి ఉంటే.. ఆస్తుల సమస్య వచ్చేది కాదు. దీనిపై ఎవ్వరికీ వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. వాస్తవానికి జగన్ సీఎం అయ్యాక ఆస్తుల పంపకం ప్రపోజల్ పెట్టాడు. ఇప్పుడు ఉన్న ఎంవోయూ జగన్ చేతితో రాసిందే. హక్కు ఉంది కాబట్టే షర్మిలకు రూ.200 కోట్లు డివిడెండ్లు ఇచ్చారు. ఎంవోయూ లో ఉన్న సరస్వతి షేర్స్ 100 శాతం అందులో లేని ఎలహంక ప్రాపర్టీ 100 శాతం షర్మిలకు వెంటనే ఇస్తానని మాట ఇచ్చి సంతకం పెట్టాడు. అవి ఇవ్వకుండా అటాచ్ మెంట్ లో లేని ఆస్తుల విషయంలో పాపకు అన్యాయం జరిగింది” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు విజయమ్మ.

Read more RELATED
Recommended to you

Latest news