షర్మిల పార్టీ గుర్తుగా టేబుల్ ఫ్యాన్..?

వైయస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు పార్టీ పేరు సహా ప్రారంభ కార్యక్రమాల గురించి పనులు జరుగుతున్నాయని తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం షర్మిల తెలంగాణలో పెట్టే పార్టీకి వైయస్సార్ తెలంగాణ పార్టీ అనే పేరును పరిశీలించినట్లు వినిపించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ సమర్పించారు. వచ్చే నెల జులై 8వ తేదీన ఈ పార్టీ ఆవిర్భావ కార్యక్రమం జరగనుందని, దానికోసం భారీ ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తుంది.

పార్టీ పేరు వార్తల్లోకి వచ్చిన తర్వాత షర్మిల పార్టీ గుర్తు ఏం ఉంటుంన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు వినిపిస్తున్న సమాచారం ప్రకారం వైయస్సార్ తెలంగాణ పార్టీ గుర్తుగా టేబుల్ ఫ్యాన్ ఉంటుందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైయస్సార్సీపీ పార్టీ గుర్తుగా సీలింగ్ ఫ్యాన్ ఉన్న సంగతి తెలిసిందే. మరి పేరుతో సహా గుర్తు విషయంలో పోలికలు షర్మిల పార్టీకి ఏ విధంగా కలిసి వస్తాయో చూడాలి.