ఈ సారి షారుఖ్ ఖాన్ ను అడ్డుకునే వారు లేరు..!

-

షారుక్ ఖాన్ తాజా చిత్రం పఠాన్ ట్రైలర్ విడుదల అయ్యి అందరిని ఆకట్టుకుంటోంది. ఈ సినిమా పై షారుక్ ఖాన్ మాత్రమే కాకుండా బాలివుడ్ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా బాలీవుడ్‌లో ఈమధ్య బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు సాధించిన చిత్రాలు చాలా తక్కువ గా ఉన్నాయి. ఇక ఈ సినిమా లో దీపిక పదుకొనె వేసుకున్న డ్రెస్ లపై దుమారం చెలరేగుతోంది. సినిమాని బాయ్కాట్ చేయాలని గోల గోల చేస్తున్నారు. అయినా కూడా ఈ సినిమా విజయాన్ని అడ్డుకోలేరని ట్రెండ్ ను బట్టి తెలుస్తోంది.

ఇప్పటికే ఈ ట్రైలర్ రికార్డ్ స్థాయి వ్యూస్ తో అదరగొడుతోంది.ఇందులో షారుఖ్ ఖాన్ ఇండియా దేశం తరుపున సీక్రెట్ ఏజెంట్ గా కనిపించబోతున్నాడని అర్ధమవుతుంది. ఇక జాన్ అబ్రహం పవర్ ఫుల్ మాఫియా లీడర్ గా కనిపిస్తున్నాడు. దీపికా పదుకునే కూడా పవర్ ఫుల్ కాప్ రోల్ లోనే కనిపిస్తుంది. ఆమెకి షారుఖ్ ఖాన్ కు మధ్య సన్నివేశాలు అదిరిపోయేలా ఉన్నాయని టాక్ నడుస్తోంది.

ఇక ఈ సినిమా మీద ఎంతగా నెగిటివ్ ప్రచారం చేస్తున్నా కూడా అడ్వాన్స్ బుకింగ్ లు రికార్డ్ స్ధాయిలో జరుగుతున్నాయి.ఈ అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే సినిమాకి యూఎస్ లో 26 లక్షల డాలర్స్ కలెక్షన్స్ వచ్చాయి. అలాగే జర్మనీలో 14 లక్షల డాలర్స్ బుకింగ్ ద్వారా వచ్చాయి ఇక ఆస్ట్రేలియాలో 7 లక్షల డాలర్స్ బుకింగ్ ద్వారా కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఓ విధంగా పదిరోజులకి అడ్వాన్స్ బుకింగ్ కావడం అంటే నిజంగా రికార్డ్ అని చెప్పాలి. ఈ సారి షారుక్ ఖాన్ ను అడ్డుకునే వారు లేరనే ప్రచారం జరుగుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news