శ‌ర్వానంద్ పెళ్లి ఆమెతోనే..!

-

టాలీవుడ్ హీరో శ‌ర్వానంద్ పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్నాడు. ఇండ‌స్ట్రీలో సుమారు 16 ఏళ్లుగా సినిమాలు చేస్తున్న ఆయ‌న‌ వ‌య‌స్సు ప్ర‌స్తుతం 36 ఏళ్లు. త‌ప చిన్ననాటి స్నేహితురాల‌ని చేసుకునేందుకు సిద్ధ‌మ‌య్యాడ‌ట. కొన్నేళ్లుగా ప్రేమ‌లో ఉన్న వీరి వివాహానికి పెద్ధ‌లు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో మంచి ముహూర్తం చూసి ఒక్క‌ట‌య్యేందుకు రెడీ అవుతున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది.

అయితే.. శర్వానంద్ చేసుకోబోయే ఆ అమ్మాయి ఎవ‌ర‌ని అనుకుంటున్నారా..? ఆమె మ‌రెవ‌రోకాదు.. మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌ అని అంటున్నారు. ఆమె బిజినెస్‌లో సెటిల్ అయ్యారట‌. యువ మహిళా వ్యాపారవేత్తగా కూడా ఆమె మంచి పేరు తెచ్చుకున్నారట‌. ఇక శర్వానంద్ ప్రస్తుతం ‘శ్రీకారం’ మూవీ చేస్తున్నారు. మరోవైపు అజయ్ భూపతి, కిషోర్ తిరుమల దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు కమిట్ అయిన విష‌యం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news