“అన్నయ్య ఆస్తులన్నీ వదిన అమ్మేసి రెండో పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయింది..” మ్యూజిక్ డైరెక్టర్ చక్రి తమ్ముడు

-

ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు చక్రి కన్నుమూసి దాదాపు 8ఏళ్లు గడిచిపోయాయి. ఆయన మరణం అంతరం అతని కుటుంబంలో కొన్ని గొడవలు తలెత్తిన సంగతి తెలిసిందే. అయితే తర్వాత అవి సర్దుమనగగా ఇప్పటివరకు వారి కుటుంబ సభ్యులు మీడియా ముందుకు రాలేదు. అయితే తాజాగా చక్రి తమ్ముడు మహిత్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు చక్రి. తెలంగాణలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన చక్రి విద్యాభ్యాసం అక్కడే పూర్తి చేసిన అనంతరం సంగీతంపై ఆసక్తితో సినిమాల్లో అడుగు పెట్టారు. పూరి జగన్నాథ్ బాచి (2000) చిత్రంతో సంగీత దర్శకునిగా చక్రి సినీ సంగీత ప్రస్థానం మొదలైంది. ఏ సంగీత దర్శకుని వద్ద సహాయకుగా చేయకుండానే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పలు సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు చక్రి. ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, సత్యం, దేశముదురు, గోపి గోపిక గోదావరి, నేనింతే, మస్కా చక్రం, ఆంధ్రావాలా, భగీరథ వంటి పలు చిత్రాలకు సంగీతాన్ని అందించారు.

Chakri's wife facing tough times from Chakri's family?

కాగా 2004లో చక్రి, శ్రావణిని పెళ్లి చేసుకున్నారు. అయితే దాదాపు పదేళ్ళ పాటు వీరిద్దరి జీవితం సజావుగానే సాగింది. 2014 డిసెంబర్ 14న చక్రికి గుండెపోటు రావటంలో రావడంతో అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఆయన మరణించారు. కాగా చక్రి మరణం అనంతరం కొన్ని ఆస్తి గొడవలు జరిగాయి. తాజాగా ఈ విషయంపై స్పందించిన చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ పలు విషయాలు తెలిపారు. “అన్నయ్య ఉన్నప్పుడు మాకు ఎలాంటి ఇబ్బందుదలు లేవు. ఆయన చనిపోయాక ఆస్తి గొడవలు పుట్టుకొచ్చాయి. అన్నయ్య లేడనే బాధకు తోడు ఈ ఘర్షణలు మొదలయ్యాయి. ప్రతి రోజు నరకంగా అనిపించేది. ఆ తర్వాత సద్దుమణిగాయి. అన్నయ్య ఆస్తుల్లో కొన్నింటిని ఆయన భార్య అమ్మేసి అమెరికాకు వెళ్లింది. అక్కడే మరో పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు. ప్రస్తుతం మాకు ఆమెతో ఎలాంటి సంబంధాల్లేవు. కొన్ని ఆస్తులకు సంబంధించిన కేసులు ఇంకా కోర్టులోనే ఉన్నాయి.. అయితే మా కుటుంబం ఆర్థికంగా రోడ్డుమీద పడేంత స్థితిలో ఏమీ లేదు. అవన్నీ అవాస్తవాలు.. అయితే ఇండస్ట్రీ నుంచి నాకు అవకాశాలు లేవనే మాట నిజమే కానీ మరీ రోడ్డు మీద పడే దీనస్థితిలో లేము..” అంటూ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news