భార్యను వేధించాడని చంపి ముక్కలుగా కోసి డస్ట్ బిన్ లో వేశాడంతే !

రోజు రోజుకి దేశంలో ఊహించని సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా అక్రమసంబంధాల వలన కుటుంబాలు సర్వనాశనం అవుతున్నాయి. తాజాగా గుజరాత్ లోని అహమ్మదాబాద్ లో బాపూజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దుర్ఘటన జరిగింది. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి తన స్నేహితుడిని ముక్కలు ముక్కలుగా కోసి చెత్త బుట్టలో పడేశారు. మీరజ్ మరియు ఇమ్రాన్ లు స్నేహితులుగా ఉన్నారు..

ప్రతి రోజూ మీరజ్ తన స్నేహితుడి కోసం ఇంటికి వస్తూ ఉండేవాడు. కానీ వచ్చినవాడు ఊరకే ఉండకుండా ఇమ్రాన్ భార్యను ఏదో ఒకటి అంటూ వేధించేవాడట. ఈ విషయంలో ఆగ్రహించిన ఇమ్రాన్ మరియు అతని భార్య ఒకరోజు సర్ప్రైజ్ అని చెప్పి ఇంటికి పిలిచి కళ్ళకు గంతలు కట్టి కత్తితో పొడిచి చంపి.. శవం దొరకకుండా ముక్కలు ముక్కలుగా కోసి చెత్త బుట్టలో పడేశారు.