పాక్ ప్ర‌ధానిగా షెహ‌బాజ్ ప్ర‌మాణ స్వీకారం.. మోడీ ట్వీట్

-

పాకిస్థాన్ లో ఇటీవ‌ల రాజ‌కీయ సంక్షోభం వ‌చ్చిన విషయం తెలిసిందే. పాక్ నేషన‌ల్ అసెంబ్లీలో అవిశ్వస తీర్మానంలో ఇమ్రాన్ ఖాన్ ప‌ద‌వి కోల్పోయాడు. దీంతో పాక్ నేషన‌ల్ అసెంబ్లీ.. కొత్త ప్ర‌ధానిని ఎన్నుకుంది. ఇమ్రాన్ ఖాన్ పార్టీ నుంచి ఎవ‌రూ పోటీ చేయ‌క‌పోవ‌డంతో ప్ర‌తిప‌క్ష పార్టీ గా ఉన్న పీఎంఎల్ (ఎన్) నాయ‌కుడు షెహ‌బాజ్ షరీఫ్ ప్ర‌ధానిగా ఎన్నిక అయ్యారు. కాగ షెహ‌బాజ్ షరీఫ్ సోమ‌వారం రాత్రి ప్ర‌ధాన మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు.

ఈ సంద‌ర్భంగా భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. పాక్ నూత‌న ప్ర‌ధాన మంత్రి షెహ‌బాజ్ షరీఫ్ కి ట్విట్ట‌ర్ వేదిక‌గా శుభాకాంక్షలు తెలిపారు. పాకిస్థాన్ ప్ర‌ధాన మంత్రిగా ఎన్నికైన ముహ‌మ్మ‌ద్ షెహ‌బాజ్ షరీఫ్ కు అభినంద‌న‌లు. ఉగ్ర‌వాదం లేని ప్రాంతంలో భార‌త దేశం శాంతి, స్థిర‌త్వాన్ని ఎల్ల‌ప్పుడు కొరుకుంటుంది. దీని ద్వారా అభివృద్ధిపై రెండు దేశాలు దృష్టి సారించ‌వ‌చ్చు. ఇది రెండు దేశాల ప్ర‌జ‌ల‌కు ఎంతో ఉప‌యోగ ప‌డుతుంది. అంటూ భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news